ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ ఓ వెంకటరమణ 

కరీంనగర్, ఏప్రిల్ 18 (జాగో న్యూస్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ చెల్పుర్, చల్లూరు, వీణవంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు జమ్మికుంట-2 సబ్ సెంటర్ మరియు చల్లూరు పల్లె దావకానల సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్శనలో హాజరు రిజిస్టర్,అవుట్ పేషెంట్ రిజిస్టరు,ఎన్ సి డి రిజిస్టర్, ఫార్మసీ స్టోర్స్ ,పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్ఆర్ ను దాని రోజువారి టెంపరేచర్ రికార్డుల నమోదును పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవుట్ పేషంట్లను పలకరిస్తూ వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ పీహెచ్సీ డెలివరీ లను , మాతా శిశు ఆరోగ్య సేవలను ఇంప్రూవ్ చేయాలన్నారు, గర్భవతుల చెకప్స్ ,అభా కార్డుల క్రియేషన్ సంఖ్యను పెంచాలన్నారు 13 సం,,ల వయస్సు పైబడిన వారందరికీ ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులలో స్క్రీనింగ్ చేసిన అందరిని రీస్క్రీనింగ్ చేస్తూ ఫాలోఅప్ చేయాలన్నారు. ప్రసూతి గది పరిశుభ్రతలను పరిశీలించి అందులో ఉండాల్సిన ప్రోటోకాల్ చార్టులను పరిశీలించారు. అదేవిధంగా చెల్లూరు సబ్ సెంటర్ కన్స్ట్రక్షన్ బిల్లింగ్ కూడా పరిశీలించినారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధి కారులు డాక్టర్ తులసి దాస్, డాక్టర్ సుచిత్ర మరియు సంబంధిత వైద్య సిబ్బంది ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత