కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 10 (జాగో న్యూస్): తిమ్మాపూర్ ఉప మండలం ( అలుగునూరు, మహాత్మ నగర్, తిమ్మాపూర్, పోరండ్ల, రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్, నుస్తులాపూర్, కొత్తపల్లి ) గ్రామాల సంయుక్త హిందూ సమ్మేళనం ఈనెల 18వ తేదీ, శనివారం సాయంత్రం ఐదు గంటలకు రామకృష్ణ కాలనీ గ్రామపంచాయతీ సుభాష్ నగర్ పరిధిలోగల శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయ ప్రాంగణం , అంగారిక టౌన్ షిప్ వద్ద నిర్వహించనున్నారు. హిందూ సమ్మేళనం నిర్వహణ కోసం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ సమితి పేరిట కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవ సమితి అధ్యక్షులుగా బొంతల కళ్యాణ్ చంద్ర, కార్యదర్శిగా రామగుడు సంపత్, ఉపాధ్యక్షులుగా ఆకు మడుపుల నరేంద్ర స్వరూప్ , వంగల అంజిరెడ్డి , తుర్తి సంతోష్ , అలువాల మనోజ్ , రామిడి మహేందర్ రెడ్డి, కొత్త రాజిరెడ్డి , నాంపల్లి సత్యం , వేల్పుల పద్మ , కోశాధికారిగా దుర్శెటి మురళి, ప్రచార కార్యదర్శిగా కొట్టాల శ్రీనివాస్ , ఉప కార్యదర్శులుగా బట్టు కర్ణాకర్, వేల్పుల నరేష్, జక్కుల కుమారస్వామి , రోడ్డ మహేష్ , ఎడ్ల భూమిరెడ్డి , ఓంకార్ , నాంపల్లి రమణ , ఓద్నాల రాములు, ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ నేదునూరి ప్రసాద్, కొత్తూరి శ్రీనివాస్, చిందం అంజి , ఈనుగొండ అశోక్ రెడ్డి , చింతం శ్రీనివాస్ , సుగుర్తి జగదీశ్వర చారి , గడ్డం అరుణ్ ,శేఖర్ రెడ్డి కమిటీ సభ్యులుగా గడప శేఖర్ , వినయ్ , సర్వేష్ , మధు , బాలరాజు ,జాప శ్రీనివాస్ రెడ్డి, వకుకలాభరణం శ్రీధర్ , జక్కుల అనిల్ , కడాల శ్రీను , జంగపల్లి నరసయ్య, దుర్శెట్టి అజయ్ , ఎడ్ల అంజిరెడ్డి, పొన్నాల తిరుపతి, బుట్టి వెంకటేష్ , ఎలుక మురళి , కుంట మల్ల ప్రేమ్ చంద్, కురాకుల స్వామి , ఎడ్ల జోగి రెడ్డి , వేల్పుల రవి , సంతోష్ రెడ్డి, సంపత్ రెడ్డి, సతీష్, వీరేందర్ , రాజేందర్ , లక్ష్మయ్య, కుమారస్వామి, లక్ష్మణ్ , వెల్ది అజయ్ , వెంకట్ , కొమ్మర రామిరెడ్డి, రోడ్డ శ్రీకాంత్, పుప్పాల సురేష్, గంగు లక్ష్మణ్, ఎదలాపురం జగదీశ్వరి, ఆవుల కీర్తి , పొలం మల్లేష్, కొమ్మెర వెంకట్ రెడ్డి , అలువాల వెంకటేష్ , తరుణ్ , వేణు చరణ్ , సుశాంత్ , ఆదిత్య , సాయికుమార్ , సాయి మణితేజ్ , రోడ్డ అశ్రిత్ , సుద్దాల సతీష్ , శ్రీకాంత్, ఓడ్నాల పూర్ణచందర్, గడ్డం లక్ష్మణ్ , గోలి కృష్ణారెడ్డి , వెల్ది విజయ్ , సారదండ్ల శ్రీనివాస్ రెడ్డి , ప్రత్యేక ఆహ్వానితులుగా 8 గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ చైర్మన్లు , పూజారులతో హిందూ సమ్మేళన పూర్తి కమిటీని శుక్రవారం రోజున ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సామాజిక సమరత తెలంగాణ ప్రాంత కార్యదర్శి పుల్లూరి రామారావు మాట్లాడుతూ హిందూ సమాజం నేడు కులం, వర్గాలుగా విడిపోయే పరిస్థితి ఉండకుండా , ఐకమత్యంతో ముందుకు కొనసాగాలనే ఉద్దేశంతో హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని , సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పిలుపునిచ్చిన పంచ పరివర్తన్ కార్యక్రమాలను చేసిన సమాజంలోకి బలంగా తీసుకువెళ్ళానని ఆయన సూచించారు. 18న జరిగే తిమ్మాపూర్ ఉప మండలంలోని 8 గ్రామాల హిందూ బంధువులందరూ కుటుంబం తో సహా హాజరై హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.









