కరీంనగర్, ఏప్రిల్ 10 (జాగో న్యూస్): కరీంనగర్ పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీ, గాయత్రి నగర్ బస్తి ల హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. శ్రీ యజ్ఞ వరాహస్వామి హిందూ సమ్మేళనం పేరిట నిర్వహించిన ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులు, వక్తలుగా సి ఎ చోళ్ళేటి రమేష్( అధ్యక్షులు) ,అన్నదానం సుబ్రహ్మణ్యం ,శ్రీ శ్రీ శ్రీ ఆత్మరాం సురేష్ మహారాజ్ , డాక్టర్ నీలిమ జిల్లా సంఘ్ చాలాక్ నిరంజనచారి లు హాజరై మాట్లాడారు. సమాజంలో కులాల పేరుతో విభజన పెరుగుతున్న నేపథ్యంలో హిందువులు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. దేశభక్తి, జాతీయభావం పెంపొందించుకోవాలని సూచించారు. విదేశీ ప్రభావాలను ఎదుర్కొనేందుకు సమాజంలో ఐక్యత అత్యంత అవసరమని , అదిశగా హిందువులంతా ఐక్యమత్యంతో ఉండాలన్నారు. హిందూ సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యంగా హిందూ సమ్మేళనాన్ని నిర్వహించడంఅభినందనీయమన్నారు. ఈ సమ్మేళనంలో హౌసింగ్ బోర్డ్, గాయత్రి నగర్ ప్రజలు, విద్యార్ధి విద్యార్థులు 720 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









