ఇందిరమ్మ కాలనీ గ్రామంలో అండర్ 19 క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన సర్పంచ్ గడ్డం రచన మధుకర్,

రాజన్న సిరిసిల్ల/తంగాలపల్లి, ఏప్రిల్ 19(జాగో న్యూస్): ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 19 సంవత్సరాల యువకుల స్ఫూర్తిదాయ కోసం క్రికెట్ టోర్నమెంట్ ఆటలు అడిపించడం చాలా సంతోషకారం అని స్థానికత సర్పంచ్ గడ్డం రచన- మధుకర్ అన్నారు. గ్రామంలోని ఉన్నటువంటి 6 టీం లుగా చేసి యువకులను ఐక్యం చేసి ఈ ఆటలు అడిపిస్తున్న మాజీద్ కమిటీ సభ్యులకు ధన్యవాదములు తెలుపారు. ముఖ్యమైన విషయం ఏంటంటే యువకులందరు మంచిగా చదువుకొని తల్లి తండ్రుల ఆశలు నెరవేర్చలని, డ్రగ్స్ కి చాలా దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొండ శ్రీకాంత్, వార్డు సభ్యులు కొండ భరత్, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపెల్లి శ్యామ్, సంకరి శ్రీనివాస్, శ్రీపతి రవి, దుబాషి రమేష్, దిడ్డి సందీప్, తాటిపాముల ప్రవీణ్ తో పాటు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు