ప్రవేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రించే బోర్డులు ఏర్పాటు చేయాలని వినతి. *బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలు 

కరీంనగర్, మే 29 (జాగో న్యూస్): జిల్లావ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలలో నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు ఫీజులు నియంత్రించే బోర్డులు ఏర్పాటు చేయాలని *బీసీ సంక్షేమ, అనుబంధ సంఘాల నాయకులు దొగ్గలి శ్రీధర్, నారోజు రాకేష్ చారి,  క్రాంతితో కలిసి ఉన్నత విద్యాధికారిని ఏడి మాధవి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతు అన్ని ప్రైవేటు పాఠశాలలో ఫీజులు నియంత్రించే బోర్డులు ఏర్పాటు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్ల ఫీజు, సంవత్సర టర్మ్ ఫీజు చెల్లించే విధాన ప్రక్రియ సులభంగా ఉంటుందని వారు తెలిపారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అధికారి పార్టీకి చెందిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడీ గురించి ప్రస్తావించి దానిని అరికట్టే విధంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారని ఉన్నత విద్యాధికారినికి వారు తెలిపారు. ఉన్నత విద్యాధికారిని సానుకూలంగా స్పందిస్తూ ఫీజులు నియంత్రించే బోర్డులను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి లేఖ పంపిస్తామని తెలిపారు. అధికారి పార్టీ కి చెందిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి అన్ని ప్రైవేటు పాఠశాలలో ఫీజులు నియంత్రించే బోర్డులు ఏర్పాటు చేయాలని పత్రిక ద్వారా మీకు సమన్వయంగా మనవి చేసుకుంటున్నాము.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు