రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, మే 29 (జాగో న్యూస్): తెలంగాణ ఐకెపి( తంగళ్ళపల్లి మండల ) వివోఏ ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వారి సమ్మెకు జిల్లా దివ్యాంగ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా జిల్లా దివ్యంగా సమితి అధ్యక్షులు దొంతినేని చంద్ర రావు మాట్లాడుతూ… ప్రభుత్వం వెంటనే గ్రామీణ ప్రాంతంలో ఐకెపి మహిళా సంఘం లో పనిచేస్తున్నటువంటి వివోఏ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం నెల జీతం 20000గా ప్రకటించి వారి కష్టానికి ప్రతిఫలం అందించవలసిందిగా, అలాగే ఎవరైతే పది సంవత్సరాల నుండి వివోలుగా పని చేస్తున్నారో వారిని పదోన్నతి కల్పించి సీసీలుగా ప్రమోట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి హెల్త్ పరంగా ఆరోగ్య కార్డును మరియు ఇన్సూరెన్స్ ను కూడా అందించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ప్రతి మహిళను కోటీశ్వరాలను చేస్తామంటున్న ప్రభుత్వం అందులో పని చేస్తున్న మహిళా సంఘాలని ముందుకు తీసుకెళుతున్న ఒక వివోఏ కి కనీసం 20 వేల జీతం ప్రకటించి మహిళల పట్ల వారికున్న చిత్తశుద్ధిని చాటుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగ సమితి నాయకులు దొంతినేని చంద్రారావు, నీరటి రాజు, మామిడాల నరేష్, అయోధ్య, రాజేందర్, అక్రమ్ దివ్యాంగులు పాల్గొన్నారు.









