కరీంనగర్/చొప్పదండి, మే 29 (జాగో న్యూస్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పిఓ డిటిటి డాక్టర్ ఉమాశ్రీ తో కలిసి చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. ఈ సందర్శనలో హాజరు రిజిస్టర్,అవుట్ పేషెంట్ రిజిస్టరు,ఎన్ సి డి రిజిస్టర్, ఫార్మసీ స్టోర్స్ ,పిల్లల వ్యాధి నిరోధక టీకాలు నిల్వ ఉంచే ఐఎల్ఆర్ ను దాని రోజువారి టెంపరేచర్ రికార్డుల నమోదును పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవుట్ పేషంట్లను పలకరిస్తూ వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలకు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు, సూచనలు ఇవ్వాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని, గర్భవతుల చెకప్స్ ,అభా కార్డుల క్రియేషన్ సంఖ్యను పెంచాలన్నారు. 13 సం,,ల వయస్సు పైబడిన వారందరికీ ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంపులలో స్క్రీనింగ్ చేసిన అందరిని రీస్క్రీనింగ్ చేస్తూ ఫాలోఅప్ చేయాలన్నారు. 14 సంవత్సరము నిండిన బాలికలకు HPV వ్యాక్సినేషన్ వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ కీర్తన మరియు సంబంధిత వైద్య సిబ్బంది ఉన్నారు.









