రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, జులై 12 (జాగో న్యూస్): ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను మన గ్రామ ప్రజలకు అందజేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేలాది కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గుతోంది. ఇది ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. ఈ చెక్కులు అందుకుంటున్న మీ కుటుంబం త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సహాయాన్ని మా గ్రామం లోని ఆడెపు విజయ (43000) రూపాయలు , గాజుల సువర్ణ (60000)రూపాయలు, వీరికి సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ విప్ & వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునిగేలా రాజు లకు అలాగే ఈ ప్రక్రియలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాo. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపెల్లి శ్యామ్, గ్రామ ఉప సర్పంచ్ కొండ శ్రీకాంత్, వార్డు సభ్యులు ఒడ్డెపెల్లి రమ, మందాటి శారదా, కొండ భరత్, తో పాటు శ్రీరామ్ నరేష్, దిడ్డి శ్రీనివాస్, భోగ రంగయ్య, గాలి వీరేశం, మామిడాల రమేష్, బండారి కిషన్, అడిగిప్పుల యమున, జంగంపల్లి భాగ్యలక్ష్మి, దికొండ జ్యోతి, పోతు అనిత తదితరులు పాల్గొన్నారు.









