కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ అలోహా- 2026 మరియు సి.ఎస్.ఐ ఇంజనీరింగ్ సాండిత్యా-2K26 ఫైనల్ ఇయర్ విద్యార్థుల వీడ్కోలు వేడుకలు గురువారం ఆటపాటలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి జ్యోతి ప్రజ్ఞలన చేసి ఈ రెండు విభాగాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాడమిక్స్ లో చురుకుదనంతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, వ్యక్తిగత విలక్షణాలను పెంపొందించుకుంటూ ఉద్యోగాలకు ఎంపిక అయ్యేలా విద్యార్థులు అందరూ సాధన చేయాలని సూచించారు. ఆటు తర్వాత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ కోర్స్ పూర్తయిన విద్యార్థులు తృతీయ సంవత్సర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని మరియు చాట్ జి.పి.టి మీద ఆధారపడకుండా స్వంత మేదస్సు ఉపయోగించి తన విజ్ఞానాన్ని మరింత మెరుగుపరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. చివరగా సి.ఎస్.ఐ విభాగాధిపతి డాక్టర్ ఖాజా జియాఉద్దీన్ మరియు మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ సి.హెచ్ శశికాంత్ గార్లు మాట్లాడుతూ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించినందుకు ప్రశంసించారు. అంతేకాకుండా అతి త్వరలో జరగబోయే పరీక్షలకు సమాయత్తము కావాలని మెకానికల్ మరియు సి.యస్.ఈ విద్యార్థులకు వారు సూచించారు. సి.యస్. ఈ విభాగాధిపతి డాక్టర్ ఖాజా జియాఉద్దీన్ గారు మాట్లాడుతూ ఫైనల్ ఇయర్ విద్యార్థులలో వివిధ కంపెనీలో చాలామంది విద్యార్థులు ఎంపికయ్యారని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థులు తమ కోర్ సిలబస్ కె పరిమితం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఆధునిక మరియు అడ్వాన్స్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు డేటా సైన్స్ మొదలగు వాటి పట్ల కూడా విజ్ఞానం కలిగి ఉన్నట్లయితే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని విద్యార్థులకు తెలియజేశారు. డాక్టర్ సి.హెచ్. శశికాంత్ గారు మెకానికల్ విభాగాధిపతి మాట్లాడుతూ మెకానికల్ సబ్జెక్టులో సమగ్ర విజ్ఞానం కలిగి ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది కంపెనీ వారు ఇచ్చే వేతనము తక్కువ అయినప్పటికీ ఉద్యోగంలో చేరి అనుభవం పొందాలని ఈ అనుభవం మరొక కంపెనీలలో అవకాశం లభించి ఎక్కువ వేతనం ఇచ్చే అవకాశం ఉంటుందని, విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ గారు అధిక మార్కులు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులలో టాపర్సు, మెమొంటోళ్లు బహుకరించి సత్కరించారు. చివరగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి ఆటపాటలతో సందడి చేశారు. ఇట్టి వీడ్కోలు కార్యక్రమంలో కళాశాల పాలనాధికారి పారువెల్ల రామారావు, మీడియా ఇన్చార్జ్ గొంటి రమేష్, వివిధ డిపార్ట్మెంట్ల విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.









