పోషణ్ పక్షోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి.. *అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

కరీంనగర్, ఏప్రిల్ 10 (జాగో న్యూస్): పోషణ్ పక్షోత్సవాన్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. శుక్రవారం అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ లో పోషణ్ పక్షం కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని అధికారులు అందరూ కలిసి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. చిన్నారులను ఫిజికల్ ఆక్టివిటీలో పార్టిసిపేట్ చేయించాలన్నారు. చిన్నారులకు హెల్త్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్ సమయానికి అందించాలన్నారు. వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలన్నారు. ఈనెల తొమ్మిది నుంచి ప్రారంభమైన పోషణ్ పక్షం కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి డి ఐ ఓ సాజిదా సిడిపివోలు డిఆర్డిఏ మెప్మా విద్య హెల్త్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత