కరీంనగర్, ఏప్రిల్ 11 (జాగో న్యూస్): మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అనుబంధ సంఘాల నాయకులు , కార్పొరేటర్లు, కుల సంఘాల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. కరీంనగర్లోని జ్యోతిబాపూలే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో పూలే జయంతి కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరు పరుశురామ్ గౌడ్, స్థానిక కార్పొరేటర్లు పడాల అజయ్, అన్నం లక్ష్మీ ప్రకాష్ , చొప్పరి జయశ్రీ, బోయిన్పల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, పొన్నం మొండయ్య, దేశ శిల్పా వేదాద్రి ముఖ్య అతిథిగా విచ్చేసి మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అని తెలిపారు. చదువు ద్వారానే బీసీలు అభివృద్ధి చెందుతారని ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని తన భార్య సావిత్రిబాయి పూలే చదువు నేర్పించి బాలికల పాఠశాలలు ఏర్పాటు చేసిన గొప్ప ఆదర్శమూర్తి అని అన్నారు. ఈ మానవమూర్తుల విగ్రహాలు ప్రతిష్టించాలని అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ కి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి , మున్సిపల్ కమిషనర్ కృష్ణ భాస్కర్ కి , బీసీ సంక్షేమ శాఖ అధికారులకు కూడా వినతి పత్రం మరియు నిరసన చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు.. పూలే ఆశయాల సాధనకై అన్ని బీసీ సంఘాల నేతలు కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున చేరుకుని జ్యోతిబాపూలే మైదానంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వచ్చే జయంతి , వర్ధంతి నాటికి ఆదర్శ దంపతుల విగ్రహాలు ప్రతిష్టించాలని , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారికి , బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి , కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి , కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ , గారికి , జిల్లా కలెక్టర్ గారికి , మున్సిపల్ కమిషనర్ గారికి , బీసీ సంక్షేమ శాఖ అధికారులకు విన్నవించుకుంటున్నాము.. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశి పెద్ది శ్రీధర్ రాజు , బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు , యువజన సంఘం అధ్యక్షులు మాదాసు సంజీవ్ , నర్సింగ్ రోజు శ్రీనివాస్ , బీసీ మహిళా సంగం అధ్యక్షురాలు దేవరకొండ సంతోషి లక్ష్మి, గుంటి స్వరూప , మంతెన కిరణ్ , దుప్పట్పల్లి మురళి , మియాపురం రవీంద్ర చారి , కాయతోజి బ్రహ్మచారి , జిఎస్ ఆనంద్ , ఐల ప్రసన్న , జోలాపురంశ్రావణి , పల్ల బోయినతిరుమల , నాగారం పల్లవి , కవిత , జల , గుమ్మడి శ్రీనివాస్ తోపాటు బీసీ సంక్షేమ సంఘం నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..








