నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ.

కరీంనగర్, ఏప్రిల్ 13 (జాగో న్యూస్): జాగృతి అధ్యక్షురాలు కవితక్క నాయకత్వంలో ఆవిర్భావం రాబోతున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ వాల్ పోస్టర్ ను ఈరోజు కరీంనగర్ లోని కోర్టు చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలంగాణ జాగృతి జిల్లా ఎస్సీ విభాగం నాయకులు చంటి శ్రీనివాస్ & జంగ అపర్ణలు రూపొందించిన పోస్టర్ ను జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25న కవితక్క నాయకత్వంలో ఈ రాష్ట్ర భవిష్యత్ ను మార్చే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభను మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో ఎర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా నుండి పెద్దఎత్తున ప్రజలు హాజరు అవుతారని కవితక్క నాయకత్వంలోనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా వారికున్న అర్ధిక ప్రయోజనాల కోసం ఈరెండు పార్టీలు పాలకపక్షం మరియు ప్రతిపక్షం ఇద్దరూ ఒకటై సహాకరించుకుంటున్నారు ప్రజలకు మాత్రం వేరు అన్నట్లు వీరు వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి కూడా విరికి మద్దతు కొనసాగుతున్న విషయాన్ని వాళ్ళ పార్టీ పార్లమెంటు సభ్యులే ప్రధానమంత్రికి రాసిన లేఖ ద్వారా తెలిసింది అని వారు అన్నారు .ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక నాయకురాలు కేవలం కవితక్క అని వారు అన్నారు. అందుకు కవితక్క నాయకత్వంలో నూతనంగా ఆవిర్భావం కాబోతున్న రాజకీయ పార్టీ వైపు తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తి చూస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, అదివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బుడిగె పర్శారం గౌడ్, గాలిపల్లి రత్నాకర్ చారి, యండి సల్మ, కొలిపాక గౌతమి, లంక మనోజ్, దాసరి అంజలి బసవేణి రాజేందర్, కుతాడి రాజిత, కొరిమి పద్మ, కుసుంబా మంజుల, పల్లె‌ శారద తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత