కరీంనగర్/మానకొండూర్, ఏప్రిల్ 17 (జాగో న్యూస్): మానకోండూర్ మండల జాగృతి నాయకురాలు కొలిపాక గౌతమి ఆద్వర్యంలో అన్నారం గ్రామానికి చెందిన పలువురు మహిళలు మరియు వీణవంక మండలానికి చెందిన సీనియర్ నాయకులు ధర్మరెడ్డి లు ఈరోజు కవితక్క నాయకత్వం పట్ల విశ్వాసంతో తెలంగాణ జాగృతిలో చేరడం జరిగింది. వారికి జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ జాగృతి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల ఇరవై ఐదోవ తేదీన కవితక్క నాయకత్వంలో తెలంగాణ భవిష్యత్త్ ను మార్చే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా మహిళలలు గ్రామాల వారిగా కవితక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా ముందుకు వస్తున్నారని దానికి ఉదాహరణ ఈరోజు ఇంతా పెద్దఎత్తున చేరుతున్న మహిళలే నిదర్శనం అని వారు అన్నారు. ఈ రాష్ట్రంలో కేవలం కవితక్క ఒక్కతే ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది రేవంత్ రెడ్డి కేటిఆర్ మరియు హరిష్ రావు లు ముగ్గురు ఒక్కటేనని వాళ్ళు ఒక్కరికి ఒకరూ రక్షణగా ఉండుకుంటు వస్తున్నారని వారు అన్నారు ఇక భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపిలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న మనకు పార్లమెంటులో ఒరిగింది ఎమి లేదు నిన్నాకు నిన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇండియా, పాకిస్థాన్ విభజనతో పోల్చడానికి తేజిస్వి సూర్యకు ఎంతా ధైర్యం ఉండాలి తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాన్ని కించపరిచే విధంగా ఇక్కడి ప్రజల ఆకాంక్షలంటే అంత చులకనా. తెలంగాణ బీజేపీ ఎంపీలకు పౌరుషముంటే అతడు చేసిన వ్యాఖ్యలను ఖండించాలి అతడి పైన చర్యలు తీసుకోవాలని వారి అధిష్టానం మీద ఒత్తిడి తేవాలని వారు అన్నారు. బారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు తేజిస్వి సూర్యకు కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి మొదటినుండి తెలంగాణ ప్రజల మీద విషపూరితమైన వైఖరితోనే ఉందని వారు అన్నారు. గతంలో కూడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఎర్పాటును తల్లి బిడ్డను వేరుచేయడం లాంటిదే అని గతంలో పార్లమెంట్ సాక్షిగా అవమాన పరచిన విషయం కూడ మనకు తెలిసిందే అని వారు అన్నారు. తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ వెంటనే క్షమాపణలు చెప్పాలి లేదా ఇక్కడి ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, బసవేణి రాజేందర్, బత్తిని సాగర్ కసుంబా మంజుల లతోపాటు ఈరోజు జాగృతిలోకిరంగపేట సునీత, రాడ్డ రడిని, రొడ్డ లత, రొడ్డ లలిత, బత్తిల మనోహర్, దాసరి లత, కనకమ్మ, సంధ్య, ఆరెళ్లి ఈశ్వరమ్మ, ఆరెల్లి కనుకలక్ష్మి, ఇప్పనపల్లి లక్షి, ఇప్పనపల్లి ఇంద్ర, కొలిపాక కనుకలక్షీ, దాసరి శంకర లింగం తదితరులు ఉన్నారు.








