పార్లమెంట్ లో మహిళా బిల్లును వ్యతిరేకించడం చారిత్రాత్మక తప్పిదం *తిమ్మాపూర్ లో రాహుల్ గాంధీ చిత్రపటాన్ని తగలబెట్టిన: బిజెపి నేతలు 

కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 18 (జాగో న్యూస్): పార్లమెంట్ లో మహిళా బిల్లు మరియు నియోజకవర్గాల పెంపు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి ఎంపీల వైఖరిని నిరసిస్తూ ఈరోజు తిమ్మాపూర్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు చింతం శ్రీననివాస్ ఆధ్వర్యంలో.. తిమ్మాపూర్ స్టేజి చౌరస్తాలో ధర్నా నిర్వహించి రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ చింతo శ్రీనివాసు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చారిత్రాత్మకంగా తీసుకున్న మహిళ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు మరియు నియోజకవర్గాల పెంపు బిల్లును వ్యతిరేకించడం హేయమైన చర్య అని అన్నారు. రాహుల్ గాంధీ మరియు ఇండియా కూటమి ఎంపీల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు