కరీంనగర్, ఏప్రిల్ 19 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయoలో ఆదివారం మాజీమంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ అని వారి చరిత్రను ఎవరు చెరుపలేరు అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా.. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టే విధానం తప్ప.. ఇప్పటికీ .. తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యం అన్నారు. కెసిఆర్ బయటకు రాడు అని విమర్శలు చేసే కాంగ్రెస్ నాయకులకు… కెసిఆర్ జగిత్యాల సభతో బయటికి వస్తున్న అనగానే భయం పుట్టి… రేపు ఎల్లుండో రైతుబంధు వేస్తానని ప్రకటించడం హాస్యస్పదమన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. కెసిఆర్ కిట్టు , దళిత బంధు , వృద్ధులకు పెన్షన్, రైతు బీమా, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను.. అమలు చేశారని.. ఈ పథకాల పైన .. ఇంతకు రెట్టింపు ఇస్తానని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలను ఇచ్చి గద్దెనెక్కి.. కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలన్నిటిని బందు చేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజలకు పనికివచ్చే ఏ ఒక్క ప్రాజెక్టు కట్టకుండానే.. ఈ రెండున్నర ఏళ్ల కాలంలో.. మూడున్నర లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. రేపు జగిత్యాల లో జరిగే సమావేశానికి భారీ ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బారాసా లో కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో… తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంధాల సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్ , గందె మహేశ్ మైనార్టీ నాయకులు మీర్ సౌఖత్ ఆలీ , నారదాసు వసంతరావు, గూడెల్లి రాజ్ కుమార్, పలువురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








