ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పెంచాలి *బడిబాట సమర్థవంతంగా నిర్వహించాలి *మౌలిక సదుపాయాలు, మరమ్మతులు పూర్తి చేయాలి *సకాలంలో సరుకుల టెండర్ల ప్రక్రియ *జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా 

కరీంనగర్, మే 29 (జాగో న్యూస్): బడిబాట కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లను పెంచాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు తదితర విభాగాల ఉన్నతాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించి అన్ని విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెంచాలని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న విద్యాసంస్థల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన మరమ్మతులు చేయించాలని అన్నారు. అన్ని పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు అపాయం సంభవించకుండా సరైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉండే పాఠశాలలు, హాస్టళ్లలో ఎక్కువ మంది సిబ్బంది, ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలు, హాస్టళ్లు ప్రారంభమయ్యలోగా కామన్ డైట్ మెనూకు అవసరమైన సరుకుల టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి నాణ్యమైన సరుకులకు టెండర్లు నిర్వహించాలని అన్నారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్, పుస్తకాలు తదితర మెటీరియల్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ సంక్షేమ శాఖ డిడి తిరుపతిరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, ఆర్.సి.ఓ అంజలి, విద్యాశాఖ ఏడి మాధవి, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కురి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు