చొప్పదండి నియోజకవర్గ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

కరీంనగర్/చొప్పదండి, మే 29 (జాగో న్యూస్): చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని చొప్పదండి గంగాధర రామడుగు మండలాల్లో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా శుక్రవారం రాత్రి సమీక్షించారు. ఈ మూడు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, పూర్తయిన కొనుగోళ్లు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలకు సమీక్షించారు. లక్ష్యం తక్కువగా ఉన్న కొనుగోలు కేంద్రాల్లో 3 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి సెంటర్లను మూసేయాలని ఆదేశించారు. నిల్వలు ఎక్కువగా ఉన్న కేంద్రాల్లో రానున్న మూడు రోజుల్లో వీలైనంత మేర ఎక్కువ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. రోజు వారీగా లక్ష్యాన్ని నిర్దేశించి చేరుకోవాలని అన్నారు. ఈ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రవాణా, హమాలి, రైతులకు చెల్లింపులు తదితర వివరాలను సమీక్షించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో 2 లారీల చొప్పున రవాణాకు సిద్ధంగా ఉంచాలని అన్నారు. తార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ సమీక్షలు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్, డి ఆర్ డి ఓ గీత, తహసిల్దార్లు సబ్ ఇన్స్పెక్టర్లు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు