సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణి చేసిన గ్రామ సర్పంచ్..

రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, జులై 12 (జాగో న్యూస్): ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను మన గ్రామ ప్రజలకు అందజేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేలాది కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గుతోంది. ఇది ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. ఈ చెక్కులు అందుకుంటున్న మీ కుటుంబం త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సహాయాన్ని మా గ్రామం లోని ఆడెపు విజయ (43000) రూపాయలు , గాజుల సువర్ణ (60000)రూపాయలు, వీరికి సహాయం అందించిన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ విప్ & వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మునిగేలా రాజు లకు అలాగే ఈ ప్రక్రియలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాo. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపెల్లి శ్యామ్, గ్రామ ఉప సర్పంచ్ కొండ శ్రీకాంత్, వార్డు సభ్యులు ఒడ్డెపెల్లి రమ, మందాటి శారదా, కొండ భరత్, తో పాటు శ్రీరామ్ నరేష్, దిడ్డి శ్రీనివాస్, భోగ రంగయ్య, గాలి వీరేశం, మామిడాల రమేష్, బండారి కిషన్, అడిగిప్పుల యమున, జంగంపల్లి భాగ్యలక్ష్మి, దికొండ జ్యోతి, పోతు అనిత తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి *వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలి *భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్

భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి… రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం* *మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి* *రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 60 చెల్లింపు* *సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి* *ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి* *ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి* *భూ రీ-సర్వే, ఇందిరమ్మ ఇండ్లు, సాదా బైనామా దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి