రక్తసంబందీకుల నుండి చట్టపరమైన దత్తత ఇచ్చిన కలెక్టర్

కరీంనగర్, మే 06 ( జాగో న్యూస్): పిల్లలు లేని దంపతులకు రక్త సంబందీకుల నుండి చట్టపరమైన దత్తతను జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా చేతుల మీదుగా బుధవారం రోజు ఇచ్చారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ-మిషన్ వాత్సల్య అధ్వర్యంలో కరీంనగర్ కు చెందిన పిల్లలు లేని ఇద్దరు వేర్వేరు దంపతులకు వారి రక్త సంబందీకుల నుండి పాప మరియు బాబు ను చట్ట పరమైనదత్తత ఉత్తర్వులతో దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. దత్తత, రక్త సంబంధీకుల నుండి దత్తత తీసుకోవాలనుకునే వారు జిల్లా పరిషత్ లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి యం. సరస్వతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డిసిపిఓ) దుర్ధాన పర్వీన్,CWC చైర్ పర్సన్ ధనలక్ష్మి,లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ రాజు మరియు డేటా అనలిస్ట్ యం.రాజ్ కుమార్ పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు