కరీంనగర్, ఏప్రిల్ 10 (జాగో న్యూస్): జనాభా గణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్, విలేజ్ మ్యాప్స్ ఫైనలైజేషన్ ప్రక్రియ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జనాభా గణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియపై ఆర్డివోలు తహసిల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హౌస్ లిస్టింగ్ విలేజ్ మ్యాప్స్ ఫైనలైజేషన్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం అధికారులు ప్రక్రియ నిర్వహించాలని ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. 150 నుంచి 200 ఇండ్ల వరకు ఒక ఎన్యుమరేటర్ ను నియమించాలని 800 ఇండ్లకు ఒక బ్లాక్ గా విభజించాలన్నారు. ఈ ప్రక్రియపై పూర్తిస్థాయిలో ఎన్యూమరేటర్లకు సూపర్వైజర్లకు తగిన శిక్షణ అందించాలన్నారు. పూర్తిస్థాయిలో వారిని సంసిద్ధులను చేయాలని సూచించారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 11 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు సాగుతుందన్నారు.. ఆర్డీవోలు తహసిల్దార్లు ప్రత్యేక దృష్టితో ఈ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలన్నారు. ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం ఈ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సెన్సెస్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ ఆర్డీవోలు కే మహేశ్వర్ రమేష్ బాబు ఇన్చార్జి సిపిఓ రామ్ దత్తారెడ్డి డిపిఓ జగదీశ్వర్ తో పాటు తహసిల్దార్లు పలువురు అధికారులు పాల్గొన్నారు.









