రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి మే 05 (జాగో న్యూస్): జిల్లా పరిషత్ బద్దెనపల్లి పాఠశాలలో పదవ తరగతిలో 530కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి భూక్యా రాజు సన్మానం చేయడం జరిగింది. అలాగే బద్దెనపల్లి గ్రామ సర్పంచ్ సిలివేరి లావణ్య చిరంజీవి విద్యార్థులకు డిక్షనరీ లను పంపిణీ చేసి వారిని ఉన్నత శిఖరాలను అధోరించాలని అభినందిస్తూ చదువే మనిషి జీవితాన్ని మార్చే గొప్ప ఆయుధమని బోధిస్తూ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరియు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు పాల్గొన్నారు.








