కరీంనగర్/తిమ్మాపూర్, మే 05 (జాగో న్యూస్): పదో తరగతి పూర్తి చేసుకుని, ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు దూరమవుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకోవడానికి చేయూతనందించడానికి “కపిల్ విద్యా వారధి” (సంక్షేమ ట్రస్ట్) ముందుకొచ్చింది. పదవ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో ( 2025-26) విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించి, 520 మార్కులు సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన రంగంలో స్థిరపడే వరకు అయ్యే ఖర్చులతో పాటు, వారికి మానసిక ధైర్యాన్ని, నైపుణ్యాన్ని అందించడమే కపిల్ విద్యా వారధి సంక్షేమ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే విద్యార్థులకు కరీంనగర్లోని సరస్వతి శిశు మందిర్లో మే 20 న అర్హత పరీక్ష ఉదయం 10గంటల నుండి 12 గంటల వరకు ఉంటుందని తెలిపారు. అర్హత పరీక్ష . పదో తరగతి సిలబస్ (గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ & ఇంగ్లీష్) ఆధారంగా ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని వారు, సింగిల్ పేరెంట్ పిల్లలుఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వరంగల్ (వరంగల్ అర్బన్), హన్మకొండ (వరంగల్ రూరల్), జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి, అర్హతా పరీక్ష రాయడానికి అర్హులు అని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మే 15 లోపు www.kapilvidyavaradhi.org వెబ్‌సైట్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు అప్పిడి రాజిరెడ్డి: 98485 26865 గీకురు శ్రీనివాస్: 99854 82292 లను చరవాణి నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.








