కరీంనగర్, మే 06 ( జాగో న్యూస్): పిల్లలు లేని దంపతులకు రక్త సంబందీకుల నుండి చట్టపరమైన దత్తతను జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా చేతుల మీదుగా బుధవారం రోజు ఇచ్చారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ-మిషన్ వాత్సల్య అధ్వర్యంలో కరీంనగర్ కు చెందిన పిల్లలు లేని ఇద్దరు వేర్వేరు దంపతులకు వారి రక్త సంబందీకుల నుండి పాప మరియు బాబు ను చట్ట పరమైనదత్తత ఉత్తర్వులతో దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని అన్నారు. దత్తత, రక్త సంబంధీకుల నుండి దత్తత తీసుకోవాలనుకునే వారు జిల్లా పరిషత్ లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి యం. సరస్వతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డిసిపిఓ) దుర్ధాన పర్వీన్,CWC చైర్ పర్సన్ ధనలక్ష్మి,లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ రాజు మరియు డేటా అనలిస్ట్ యం.రాజ్ కుమార్ పాల్గొన్నారు.









